: పవన్ కల్యాణ్ కు పవన్ కల్యాణే పోటీ: కోట
'టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కు పవన్ కల్యాణే పోటీ' అని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. అత్తారింటికి దారేది థాంక్స్ గివింగ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ సక్సెస్ మీట్ లు జరుపుకోవడం అరుదని, కానీ, ఈసారి ఆయనకు ఎందుకో ఆనందం వెలిబుచ్చాలని అనిపించినట్టుందని అన్నారు. ఈ సినిమాను ఆదరించినందకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.