: త్రివిక్రమ్ పై కోట ప్రశంసలు


'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించినందుకు ఎంతో ఆనందంగా ఉందని కోట శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాదు శిల్పకళా వేదికలో జరుగుతున్న అత్తారింటికి దారేది థాంక్స్ గివింగ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడారు. కథ ఎంత గొప్పదైనా, దాన్ని సరిగ్గా తెరకెక్కించినప్పుడే ఆ సినిమా విజయవంతం అవుతుందని చెప్పారు. ఈ సినిమాకూ ఆ సూత్రం వర్తిస్తుందన్నారు. ఆ క్రెడిట్ అంతా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దే అని చెప్పారు. ఈ సినిమాలో చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడాలని త్రివిక్రమే సూచించాడని కోట వెల్లడించారు. సినిమాలో ఆ యాస ప్రజాదరణకు నోచుకుందని అన్నారు.

  • Loading...

More Telugu News