: శిల్పకళా వేదికలో తారలు కొలువైన వేళ..
'అత్తారింటికి దారేది' చిత్ర యూనిట్ నిర్వహిస్తున్న థాంక్స్ గివింగ్ ఫంక్షన్ కు వేదికగా నిలిచిన శిల్ప కళా వేదికలో సినీ తారలు కొలువయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రణీత, కోట శ్రీనివాసరావు, ఎంఎస్ నారాయణ, రావు రమేశ్, అలీ, రఘుబాబు, బ్రహ్మాజీ, అమిత్ కుమార్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, సమీర్, సుదర్శన్ తదితరులు హాజరయ్యారు. మరికాసేపట్లో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ రానున్నారు.