: రావణుడిని పూజించే గ్రామం


రామాయణంలో రావణుడు విలన్ అన్న సంగతి తెలిసిందే. ఈ అభిప్రాయంతోనే దసరా ఉత్సవాల సందర్భంగా దేశంలో రావణ దహనం చేయడం చూస్తుంటాం. కానీ, ఓ గ్రామంలో మాత్రం రావణుడిని దైవంలా పూజిస్తారు. మధ్యప్రదేశ్ లోని విదిశ జిల్లా రావణగ్రామ్ లో ప్రజలకు దశకంఠుడే ఇష్టదైవం. దసరా రోజున ఎల్లెడలా రావణ దహనం జరుగుతుంటే ఇక్కడ విషాదఛాయలు కనిపిస్తాయి. వివరాల్లోకెళితే.. గ్రామంలోని అత్యధికులు కన్యాకుబ్జ బ్రాహ్మణ శాఖకు చెందినవారు. రావణుడు కూడా ఇదే శాఖకు చెందినవాడని వీరి విశ్వాసం. అందుకే ఆయనకు గుడికట్టి పూజలు చేస్తున్నారు. వీరికే కాకుండా ఇతర కులస్తులకు కూడా లంకాధీశుడే ఇష్టదైవం.

ఆ ఆలయంలో రావణుడు శయన స్థితిలో కనిపిస్తాడు. ఇంతకుముందోసారి, విగ్రహాన్ని నిటారుగా ఉంచాలని యత్నించగా తీవ్ర కరవుకాటకాలు సంభవించాయని, అందుకే అలాంటి ప్రయత్నాలు విరమించుకున్నామని గ్రామస్తులు అంటున్నారు.

  • Loading...

More Telugu News