: కూతురి ప్రేమ వ్యవహారంలో తల్లి ప్రాణం బలి
కూతురి ప్రేమ వ్యవహారంలో తల్లి బలైన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెంలో జరిగింది. వివరాల్లోకెళితే.. వడ్లవానిపాలెంకు చెందిన వెంకటలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అఖిల, అదే గ్రామానికి చెందిన గంగరాజు ప్రేమించుకున్నారు. అయితే, గంగరాజు మోసం చేశాడంటూ అఖిల కుటుంబం పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి గంగరాజును అరెస్ట్ చేశారు. ఇటీవలే రిమాండ్ నుంచి బయటికొచ్చిన గంగరాజు.. వెంకటలక్ష్మి, ఆమె కుమార్తెలను బెదిరించసాగాడు. దీంతో, ఆ కుటుంబం పురుగులమందు తాగింది. తల్లి వెంకటలక్ష్మి చికిత్స పొందుతూ మరణించగా, ఆమె కుమార్తెలు మృత్యువుతో పోరాడుతున్నారు.