: వైఎస్సార్సీపీ సభకు అనుమతి ఎందుకివ్వరు?: రాఘవులు
తెలంగాణ వాదులకు, ఏపీఎన్జీవోలకు హైదరాబాదులో సభ పెట్టుకునేందుకు అనుమతిచ్చిన సర్కారు, వైఎస్సార్సీపీకి ఎందుకు నిరాకరిస్తోందని ప్రశ్నించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుందని అన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 19న వైఎస్సార్సీపీ హైదరాబాదులో జరుపతలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ఈ విషయాన్ని పోలీసులు మరోసారి పరిశీలించాలని సూచించారు.