: 'భాయ్' గీతాల ఆవిష్కరణ


అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం 'భాయ్' ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకరాల ఫ్లోర్లో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ, ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను పెద్ద ఎత్తున నిర్వహిద్దామని భావించినా, కొన్ని కారణాల వల్ల వీలవ్వలేదని వివరణ ఇచ్చారు. ఇక, సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ సినిమాకి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. చంద్రబోస్, అనంతశ్రీరామ్ తదితరులు గీతరచన చేశారు. వీరభద్రం చౌదరి దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించింది.

  • Loading...

More Telugu News