: సచిన్ రిటైర్మెంట్ 'టూ లేట్' అంటున్న బాల్య మిత్రుడు


సచిన్ టెండూల్కర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంపై మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ స్పందించాడు. సచిన్ ఎప్పుడో క్రికెట్ కు వీడ్కోలు పలకాల్సిందని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని కాంబ్లీ అభిప్రాయపడ్డాడు. ఓ పత్రికతో మాట్లాడుతూ, టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రిటైరై ఉంటే గౌరవంగా ఉండేదన్నాడు. తాను చూసిన సచిన్, గత రెండేళ్ళుగా ఆడుతున్న సచిన్ కూ చాలా వ్యత్యాసం ఉందన్నాడు. పాఠశాల స్థాయి నుంచి సచిన్ తనకు ప్రియమిత్రుడని, ముంబయి శారదాశ్రమ్ స్కూలు తరుపున తాము పలు రికార్డులు నెలకొల్పామని కాంబ్లీ గుర్తు చేసుకున్నాడు. విఖ్యాత క్రికెట్ గురు రమాకాంత్ అచ్రేకర్ శిక్షణలో తామిద్దరం బ్యాటింగ్ ఓనమాలు నేర్చుకున్నామని తెలిపాడు. హ్యారిస్ షీల్డ్ క్రికెట్ టోర్నీలో భాగంగా సచిన్, కాంబ్లీ శారదాశ్రమ్ స్కూలు తరుపున బ్యాటింగ్ చేస్తూ అజేయంగా 664 పరుగులతో రికార్డు సృష్టించారు.

  • Loading...

More Telugu News