: ఒడిశా ముఖ్యమంత్రికి 'ఫైలిన్' సెగ


ఫైలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్ళిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు చేదు అనుభవం ఎదురైంది. బరంపురం జిల్లాలో ఆయన కాన్వాయ్ సాగుతుండగా ఓ గ్రామం రోడ్డుకు అడ్డంగా విరిగిన చెట్లు, దుంగలను వేసి స్థానికులు అడ్డుకునే యత్నం చేశారు. అయితే, గంజాం డీఐజీ, ఇతర అధికారులు వెంటనే స్పందించి సీఎం కాన్వాయ్ ముందుకు కదిలేలా చర్యలు తీసుకున్నారు. తమ గ్రామానికి సీఎం రాలేదని, అక్కడ ఉన్న పునరావాస శిబిరాన్ని సందర్శించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఓ గ్రామంలో పునరావాస శిబిరాన్ని సందర్శించిన నవీన్ పట్నాయక్ కు అక్కడ తీవ్ర నిరసన ఎదురైంది. శిబిరంలో సౌకర్యాలు కొరత తీవ్రంగా ఉందని, తాగు నీరు, తగినంత ఆహారం లభించడంలేదని అక్కడి గ్రామస్తులు ముఖ్యమంత్రిని నిలదీశారు. దీంతో, ఆయన పునరావాస శిబిరాల సందర్శనకు వెళ్ళకుండా పర్యటన సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News