: చంద్రబాబుకు శంకర్రావు పరామర్శ


హైదరాబాదులోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పలువురు నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు కూడా బాబును పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బాబు తనకు మంచి మిత్రుడన్నారు. అందుకే వచ్చానన్నారు. తన రాకలో రాజకీయాలకు తావులేదన్నారు.

  • Loading...

More Telugu News