: తీర్మానం సందర్భంగా విప్ జారీ చేయొద్దని చెప్పాం: ఆనం
రాష్ట్ర విభజన తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో విప్ జారీ చేయొద్దని పార్టీ అధిష్ఠానానికి సూచించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, సీఎల్పీ ఇప్పటికే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిందని తెలిపారు. ఇక సీమాంధ్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తీర్మానాన్ని శాసనసభలోనూ వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. సీఎం కిరణ్ నాయకత్వంలోనే తాము 2014 ఎన్నికలకు వెళతామని చెప్పుకొచ్చారు. అప్పటివరకూ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పేర్కొన్నారు.