: బంగారు ఆభరణాలపై వడ్డీ కావాలా?


బంగారు ఆభరణాలు మీ ఇంటి బీరువాలో మూలుగుతున్నాయా? అయితే, వాటిపై వడ్డీని రాబట్టుకునే రోజులు రానున్నాయి. బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న బ్యాంకు ఆఫ్ నోవా గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ను ఆరంభించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం జెమ్స్ అండ్ జ్యూయెలర్స్ ట్రేడ్ ఫెడరేషన్ వారితో కలిసి రిజర్వ్ బ్యాంకును సంప్రదించింది.

వాణిజ్య లోటును తగ్గించే ఉద్దేశంతో బంగారం దిగుమతులను నిరుత్సాహ పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకుంది. దీంతో దేశీయంగా బంగారం సరఫరాలు తగ్గిపోయాయి. అదే సమయంలో దేశీయంగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది. రానున్న కాలంలో ఇంకా డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ అవసరాలు తీర్చుకునేందుకు వడ్డీ రూపేణా ప్రజల నుంచి బంగారాన్ని సేకరించడం పరిష్కారంగా బ్యాంకు ఆఫ్ నోవా భావిస్తోంది.

భారతీయుల ఇళ్లలో 20,000 టన్నుల బంగారం ఉంటుందని అంచనా. గోల్డ్ డిపాజిట్ స్కీములో ప్రజలు ఇచ్చే బంగారం విలువపై 2.5శాతం నుంచి 3 శాతం వడ్డీ చెల్లించే యోచనలో ఉన్నారు. జెమ్స్ అండ్ జ్యూయెలర్స్ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ హరేష్ సోనీ మాట్లాడుతూ, గోల్డ్ డిపాజిట్ స్కీముపై ఇటీవలే రిజర్వ్ బ్యాంకుతో చర్చించామని, నాలుగు వారాల్లో అనుమతి వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News