: విజయనగరం చేరుకున్న బొత్స.. భద్రత పెంపు
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజయనగరం చేరుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో పాల్గొనేందుకు ఆయన సొంత జిల్లాకు వచ్చారు. 75 రోజుల తర్వాత ఆయన తన జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యంగా 'బొత్స విభజన ద్రోహి' అంటూ విజయనగరంలో ఆందోళనకారులు బొత్స ఆస్తులపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో బొత్స విజయనగరం రావడంతో పోలీసులు ఆయన నివాసం వద్ద, పట్టణంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలపై బొత్స రేపు అధికారులతో చర్చించనున్నారు.