: విద్యుత్ కోతలతో జనం ఇక్కట్లు: సీపీఎం రాఘవులు
రాష్ట్రంలో విద్యుత్ కోతలను తగ్గించేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఆరోపించారు. విద్యుత్ వినియోగంపై ప్రభుత్వ విధానం వల్ల పరిశ్రమలు మూలపడేలా ఉన్నాయని, రైతులు 20 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేకపోతున్నారని రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విద్యుత్ కోతలతో విద్యార్థులు పరీక్షలకు సరిగా చదువుకోలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు.