: కేంద్ర మాజీ మంత్రి మోహన్ ధారియా కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి మోహన్ ధారియా (89) పుణేలో కన్నుమూశారు. కిడ్నీ వ్యాధి కారణంగా ఆయన మరణించారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయనను శనివారం ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. ధారియా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. అనంతరం భారతీయ లోక్ దళ్ లో చేరి మొరార్జీ దేశాయ్ సర్కారులో మంత్రి పదవి చేపట్టారు. గతంలో ఆయన న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా పనిచేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ధారియా పుణేలో పర్యావరణ ఉద్యమకారుడిగా క్రియాశీలకంగా ఉన్నారు. సామాజిక సేవల రంగంలో ఆయన కృషిని గుర్తిస్తూ కేంద్రం 2005లో ఆయనను 'పద్మ విభూషణ్'తో గౌరవించింది.