: విజయనగరాన్ని వీడని కర్ఫ్యూ
విజయనగరంలో అల్లర్లు సద్దుమణిగి వారం రోజులు దాటినా పట్టణంలో కర్ఫ్యూ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ముందు జాగ్రత్తగా కర్ఫ్యూను కొనసాగిస్తూనే ఉన్నారు. కాకపోతే రోజూ పగటి పూట కర్ఫ్యూను సడలించి రాత్రి వేళల్లో యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ రోజు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు.