: విభజించకుంటే.. 22ఎంపీ సీట్లిస్తాం: రాయపాటి
రాష్ట్ర విభజన జరగకుండా ప్రయత్నిస్తున్నామని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. విభజిస్తే తెలంగాణలో కాంగ్రెస్ కు 12 సీట్లలోపే వస్తాయని, విభజించకుండా ఉంటే సీమాంధ్రలో 22 ఎంపీ స్థానాలు అందిస్తామని అన్నారు. రాష్ట్ర విభజనకు తెలుగుదేశం, వైఎస్సార్సీపీ పార్టీలే కారణమని చెప్పారు. వీటి వైఖరి కారణంగానే కాంగ్రెస్ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు.