: ఐసీయూలో చంద్రబాబునాయుడు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో ఆరు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన ఆయన నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా బాగా నీరసంగా ఉండడంతో ఆయన నేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎర్రమంజిల్ లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజికి వెళ్లి చేరారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిరాహార దీక్ష కారణంగా ఆయన కామెర్ల బారిన పడ్డారని, కాలేయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నిన్న రాత్రి విలేకరులకు తెలిపారు.

సహజంగా నెలకు కిలో కంటే ఎక్కువ బరువు తగ్గకూడదని, కాని చంద్రబాబు ఆరు రోజుల్లోనే నాలుగున్నర కిలోల బరువు తగ్గారని, ఇది ప్రమాదకరమని ఆయన తెలిపారు. యూరిక్ యాసిడ్, ఎల్ డీహెచ్ స్థాయిలు అధికంగా ఉన్నాయని, కీటోన్లు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. 63 ఏళ్ళ వయసులో ఇలాంటి దీక్షలు చేయటం చాలా ఇబ్బందికరమని ఆయన వివరించారు. ఆయనకున్న ఆహారపు అలవాట్లు, శరీరపటుత్వం వల్ల తట్టుకోగలిగినా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తాయని చెప్పారు. 48 గంటలపాటు ఐసీయూలో ఉంచాలని, 24గంటలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, ఇందుకు ఆయన నిరాకరిస్తున్నా తప్పదని తెలిపారు. ఒక వైద్యుల బృందం ప్రత్యేకంగా ఆయనను పరీక్షిస్తోందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News