: బరువు తగ్గాలనుకుంటే చిన్ని మార్గం


బరువు తగ్గాలనుకునేవారు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా కాకుండా మన వంటింట్లోనే చక్కటి వైద్యంతో మనం ఎంచక్కా బరువు తగ్గవచ్చు అని కొందరికి మాత్రమే తెలుసు. ఇలాంటి చిన్న చిట్కాల్లో మనం కూరల్లో వాడుకునే రామములగ పండ్లు ఒకటి.

బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు మూడు రామములగ పండ్లను తింటే మూడు నెలల్లో బరువు తగ్గడం గుర్తిస్తారు. అలాగే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలనుకుంటే ఇలాంటి వాటికి కూడా రోజూ రామ ములగపండును ఒకటి తినడం వల్ల వాటిలో ఉండే ఆమ్లాలు, విటమిన్‌ ఎ, సి కిడ్నీలో రాళ్లను ఏర్పడకుండా అడ్డుకుంటాయి. శరీరానికి కావలసిన అన్ని పోషకపదార్ధాలు కూడా ఇందులో లభిస్తాయి. షుగరు వ్యాధి ఉన్నవారు రోజూ ఈ పండ్లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇన్ని లాభాలున్న చిన్ని రామములగ పండ్లను చక్కగా తినేసి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

  • Loading...

More Telugu News