: మేకా మేకా... నీ రేటింతా...!
అనగనగా ఒక మేకపోతు ఉండేది. దాన్ని దాని యజమాని ఎంతో ముద్దుగా పెంచుకున్నాడు. ఇప్పుడు బక్రీద్ సీజను కావడంతో తాను ఇంతకాలం పెంచుకున్న మేకను అమ్మేయాలనుకున్నాడు. అమ్మకానికి వచ్చే ఎలాంటి వస్తువుకైనా ఒక రేటును యజమాని పెడతాడుకదా... అలా ఆ మేకకు పెట్టిన రేటెంతో తెలుసా... అక్షరాలా రెండున్నర లక్షలు. ఆశ్చర్యంతో నోరు తెరుచుకుందా...?
మరో రెండు రోజుల్లో రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ మెహిదీపట్నంలోని నానల్‌నగర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన మేకపోతును అమ్మకానికి పెట్టాడు. దాని ధరను రెండున్నర లక్షలుగా నిర్ణయించాడు. చూడడానికి బాగా బలిష్టంగా ఉండడంతో అంత ధరను వెచ్చించి మెహిదీపట్నంకు చెందిన వ్యక్తి దాన్ని కొనుగోలు చేశాడట. మొత్తానికి మేకకు కూడా ఇంత రేటుంటుందాని పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.