: 28.65 లక్షలతో చెక్కేసిన డ్రైవర్లు


వస్త్రాల వ్యాపారి వద్ద పనిచేసే ఇద్దరు డ్రైవర్లు 28.65 లక్షల రూపాయలతో పరారయ్యారు. న్యూఢిల్లీలోని మజ్నుకాతిలా ప్రాంతంలో సునీల్ కుమార్ తన స్నేహితుడు లలిత్ తో కలిసి వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. వారిద్దరూ కలిసి ఇద్దరు డ్రైవర్లను నియమించుకున్నారు. ఈ నెల 5న లలిత్ 28 లక్షల 65 వేల రూపాయల నగదుతో పొద్దు పోయాక దుకాణానికి బయలుదేరాడు. లలిత్ నేరుగా దుకాణంలోకి వెళ్లగా డ్రైవర్ సునీల్ కారు పార్క్ చేసి వస్తానని చెప్పి కారుతో ఉడాయించాడు. ఎంతసేపటికి డ్రైవర్ సునీల్ రాకపోవడంతో అనుమానం వచ్చిన లలిత్ వెళ్లి చూసేసరికి అక్కడ కారు కన్పించలేదు.

దీంతో, అనుమానం వచ్చిన లలిత్ సునీల్ సెల్ కు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్చాఫ్! దీంతో, లలిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సునీల్ ఇల్లు సోదాచేయగా అప్పటికే అతడు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. దీంతో, మరో డ్రైవర్ ను ఆరాతీయాలని అతని ఇంటికి వెళ్లిన పోలీసులకు నిరాశ తప్పలేదు. అతను కూడా ఇల్లు ఖాళీ చేసి పరారైనట్టు తెలుసుకున్నారు. దీంతో, ఇద్దరు డ్రైవర్లూ కూడబలుక్కుని నగదు చోరీ చేసి ఉడాయించినట్టు భావిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News