: హైదరాబాదు చేరుకున్న బాబుకు ఘనస్వాగతం
ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నుంచి ఈ మధ్యాహ్నం డిశ్చార్జ్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాదు చేరుకున్నారు. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ ఢిల్లీలో దీక్ష చేపట్టి, నేడు రాష్ట్రానికి తిరిగి వచ్చిన బాబుకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చారు. కాగా, బాబు దీక్షను పోలీసులు భగ్నం చేయగా, ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే, ఆరోగ్యం మరీ క్షీణిస్తుండడంతో వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. బాబు, తదుపరి చికిత్స కోసం రేపు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేరనున్నట్టు సమాచారం.