: సచిన్ ఇంకా ఆడాలంటున్న లంక మాజీ కెప్టెన్
టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రకటించడం పట్ల శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ స్పందించారు. సచిన్ మరికొంత కాలం క్రికెట్ లో కొనసాగితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన రణతుంగ మీడియాతో ముచ్చటించారు. సచిన్ ఆడడం వల్ల టెస్టు క్రికెట్ కు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకొచ్చారు. రిటైర్మెంట్ అనంతరం కూడా సచిన్ టెస్టు క్రికెట్ కు మద్దతిస్తాడనే భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఏ ఆటగాడికైనా వీడ్కోలు నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమని చెప్పారు.