: ఆస్ట్రేలియా మహిళపై భారతీయుల అత్యాచారం
ఆస్ట్రేలియా మహిళపై ఇద్దరు భారతీయులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాలోని కిపాక్స్ ప్రాంతంలో నివసించే మహిళకు అజిత్ పాల్ సింగ్, రణబీర్ సింగ్ అనే యువకులు ఫోన్ ద్వారా సోషల్ మీడియా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు.ఆమె దాన్ని ఆమోదిస్తూ మెసేజ్ పంపింది. దీంతో, కలుద్దామని వారు ప్రతిపాదించగా, ఆమె కిపాక్స్ ఫెయిర్ షాపింగ్ సెంటర్ వద్దకు వెళ్ళింది. అయితే, వారిరువురు తమ ఫోన్లలో ఉన్న మెసేజ్ ను ఆమె భర్తకు చూపుతామని, ఆమె బిడ్డకు హాని తలపెడతామని బెదిరించారు.
అనంతరం ఆమెను బలవంతంగా బెల్కోనెన్ తీసుకెళ్ళి అత్యాచారం జరిపారు. ఈ మేరకు సదరు మహిళ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి ఈ నెల 22 వరకు కస్టడీ విధించారు. ఈమెకు చాట్ మెసేజ్ పంపిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.