: బలహీన పడిన ఫైలిన్.. తీవ్ర వాయుగుండంగా మారనున్న తుపాను


ఒడిశాలోని గోపాల్ పూర్ వద్ద తీరం దాటిన ఫైలిన్ తుపాను మరింత బలహీన పడింది. ప్రస్తుతం ఒడిశాలోని జార్సుగూడకు సమీపంలో కొనసాగుతోంది. ఇది క్రమంగా వాయవ్యంగా కదిలి రాగల ఆరు గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావం మన రాష్ట్రంపై తీవ్రంగా ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉత్తరాంధ్రలో మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఆంధ్ర ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News