: ఆసీస్ 237/9 డిక్లేర్డ్


హైదరాబాద్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ను 237/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. సాధించింది స్వల్ప స్కోరే అయినా, తొలి రోజు ఆటలో కొన్ని ఓవర్లే మిగిలి ఉన్నా.. త్వరితగతిన వికెట్లు తీసి భారత్ ను ఒత్తిడిలోకి నెట్టాలన్న ఆలోచనతోనే క్లార్క్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఉప్పల్ మైదానంలోనూ ఆసీస్ కు స్పిన్ గండం తప్పలేదు.

టీ విరామం వేళకు 187/4 స్కోరుతో నిలకడ కనబర్చిన కంగారూలు ఆ తర్వాత ఒకరివెంట మరొకరు పెవిలియన్ కు బారులు తీరారు. మ్యాచ్ తొలి సెషన్ లో పేసర్ భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో ఆసీస్ పతనానికి శ్రీకారం చుట్టగా..  స్పిన్నర్లు జడేజా (3/33), హర్భజన్ (2/52) ధాటికి ఆసీస్ మిడిలార్డర్ కకావికలం అయింది. తొమ్మిదో వికెట్ రూపంలో వెనుదిరిగిన కెప్టెన్ క్లార్క్ (91) సెంచరీకి 9 పరుగుల దూరంలో జడేజా బంతికి బౌల్డయ్యాడు. ఆ తర్వాత కాస్పేటికే ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 

  • Loading...

More Telugu News