: హౌరా-పూరి మార్గంలో రైళ్ళ పునరుద్ధరణ
తుపాను కారణంగా నిలిపివేసిన రైళ్ళను పునరుద్ధరించారు. హౌరా-పూరి మార్గంలో రైళ్ళను నడపాలని నిర్ణయించినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. కాగా, ఫైలిన్ తుపాను ఈ మధ్యాహ్నానికి బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు.