: తుపాను నష్టంపై సమగ్ర నివేదిక అందిస్తాం: రఘువీరా


రాష్ట్రంలో తుపాను నష్టంపై సమగ్ర నివేదిక అందిస్తామని మంత్రి రఘువీరారెడ్డి శ్రీకాకుళం జిల్లాలో తెలిపారు. యంత్రాంగం అప్రమత్తతతో ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగామని చెప్పారు. పంటలు, పండ్ల తోటల నష్టాలను రేపటి నుంచి సమగ్రంగా అంచనా వేయిస్తామని మంత్రి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో దెబ్బతిన్న కొబ్బరి రైతులకు ఉదారంగా సాయమందిస్తామని తెలిపారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారులకు ఉచితంగా బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి కృపారాణి, రాష్ట్రమంత్రులు గంటా శ్రీనివాసరావు, శత్రుచర్ల, బాలరాజు, కొండ్రు మురళిలతో కలిసి ఆయన బారువ సముద్ర తీరాన్ని పరిశీలించారు. 30 వేల ఎకారాల్లో వరి, కొబ్బరి పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News