: ఫైలిన్ తుపాను నష్టంపై ప్రాథమిక అంచనా


ఫైలిన్ తుపాను నష్టంపై ప్రభుత్వం ప్రాథమిక అంచనా విడుదల చేసింది. తుపాను వల్ల 7,500 హెక్టార్లలో వరి, 100 హెక్టార్లలో మొక్కజొన్న నీటమునిగాయి. 100 హెక్టార్లలో చెరకు, 3,219 హెక్టార్లలో కొబ్బరి, 929 హెక్టార్లలో జీడిపంటలకు నష్టం వాటిల్లింది. 653 హెక్టార్లలో కూరగాయలు, 283 హెక్టార్లలో అరటి, 46 హెక్టార్లలో బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. 18 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. 33 పశువులు మృతి చెందాయి. తుపాను బీభత్సానికి శ్రీకాకుళం జిల్లాలో 18 ఇళ్లు పూర్తిగా, 53 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. విజయనగరంలో 8, విశాఖలో 3 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 42,279 మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి. బాధిత మత్స్యకార కుటుంబాలకు 10 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News