: వివస్త్రను చేసి.. గుండు గీసిన అత్తమామలు


కులాంతర వివాహం ఆ యువతి పాలిట శాపంగా మారింది. మహారాష్ట్రలో ఆదర్శ వివాహం చేసుకున్న ఓ యువకుడి తల్లిదండ్రులు అతని భార్యపాలిట దుశ్శాసనులుగా మారారు. వివరాల్లోకెళితే.. థానె జిల్లా షాహాపూర్ తాలుకా పడ్గా పోలీసు స్టేషన్ లో ఓ ఫిర్యాదు అందింది. భివాండి పట్టణంలోని ఓ గోడౌన్ లో ప్యాకర్ గా పని చేస్తున్నప్పుడు సదరు యువతికి యోగేష్ పాటిల్ తో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు వద్దంటున్నా యోగేష్ ఆమెను పెళ్లి చేసుకుని అత్తవారింట్లో ఉంటున్నాడు. ఆగస్టు 30న తమ విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న వారిద్దరినీ యోగేష్ కుటుంబసభ్యులు బలవంతంగా వారింటికి తీసుకెళ్లారు. తరువాత ఇద్దరినీ గుమ్మానికి కట్టేసి కొట్టారు.

తరువాత ఆమె బట్టలు విప్పి ఆమెకు గుండు గీశారు. అంతటితో ఆగకుండా యోగేష్ సోదరుడు సెల్ ఫోన్ తో తనను నగ్నంగా ఫోటోలు తీశాడని ఆ యువతి పేర్కొంది. గ్రామసర్పంచి తమను రక్షించి పడ్గా గ్రామానికి తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చాడని యువతి పేర్కొంది. దీంతో, యువతి పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఆమె అత్తమామలపై 498ఎ, 354,353,504,506, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ చట్టాల క్రింద కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News