: వాస్తవాలు తెలియజెప్పేందుకే దీక్ష: బాబు


ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనపై ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేందుకే దీక్ష చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. తన దీక్షకు సంఘీభావం తెలిపిన వారందరికీ బాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అనిశ్చితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. వైఎస్సార్సీపీ మద్దతుతో లబ్ది పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీపై అందరికీ సమన్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పెద్దలు రోజుకో మాట మాట్లాడి అయోమయానికి గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన జరిగితే హైదరాబాదులో తమ పరిస్థితి ఏమిటని సీమాంధ్రులు భయపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఉద్యోగాలు, పిల్లల భవిష్యత్ పై భయంతోనే సీమాంధ్రులు ఉద్యమం చేస్తున్నారని బాబు వివరించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఉద్యమంలో ఉన్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News