: ఫిర్యాదు చేసేందుకు వెళితే.. లాఠీ విరిగింది!


మహిళలను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేయబోయిన ఓ యువకుడిని సీఐ చితకబాదిన ఘటన సికింద్రాబాదులోని నేరేడ్ మెట్ లో జరిగింది. నేరేడ్ మెట్ బతుకమ్మ వేడుకల్లో కొందరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ రాకేశ్ అనే యువకుడు సీఐ రమేశ్ కొత్వాల్ కు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ సీఐ సదరు యువకుడిపైనే దాడికి దిగాడు. నీకెందుకంటూ లాఠీకి పనిచెప్పాడు. దీంతో, రాకేశ్ కుడి కంటికి తీవ్రగాయం కాగా, వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని రాకేశ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజీ కోసం సీఐ ప్రయత్నిస్తున్నాడని, వైద్య ఖర్చులు తానే భరిస్తానంటున్నాడని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News