: తొలి బంతికి వికెట్ తీసిన యువీ


యువరాజ్ సింగ్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుతున్నాడు. టి20 పోరులో కళ్ళు చెదిరే బ్యాటింగ్ తో అలరించిన యువీ.. ఆసీస్ తో వన్డేలో తొలి బంతికే వికెట్ తీశాడు. 20వ ఓవర్లో బంతినందుకున్న ఈ పంజాబ్ వీరుడు మొదటి బంతికి ప్రమాదకర షేన్ వాట్సన్ (2)ను బలిగొన్నాడు. దీంతో, భారత శిబిరంలో ఉత్సాహం పెల్లుబికింది. అంతకుముందు, సెంచరీ భాగస్వామ్యంతో దూసుకెళుతున్న ఆసీస్ ఓపెనింగ్ జోడీని జడేజా విడదీశాడు. అద్భుతమైన బంతితో ఫిల్ హ్యూస్ (47) ను పెవిలియన్ చేర్చాడు. 20 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 2 వికెట్లకు 114. క్రీజులో ఫించ్ (61 బ్యాటింగ్)కు తోడు కెప్టెన్ బెయిలీ (1 బ్యాటింగ్) ఉన్నాడు.

  • Loading...

More Telugu News