: ఇంద్రకీలాద్రిపై రద్దీ.. సాయంత్రం తెప్పోత్సవం
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. పండుగరోజు దేవి దర్శనానికి పోటెత్తిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కృష్ణానదిలో హంసవాహనంపై తెప్పోత్సవం జరగనుంది. గంగాపార్వతి సమేత మల్లేశ్వరస్వామి హంసవాహనంపై విహరించనున్నారు. మరోపక్క, రాష్ట్రంలోని పలు అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.