: రాజకీయాల్లో అంటరాని వారుండరు: పవార్
రాజకీయాలలో అంటరాని వారంటూ ఎవరూ ఉండరని యూపీఏ భాగస్వామ్య పక్షం ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పవార్ మాట్లాడారు. రాజకీయాలలోనూ, సామాజిక సేవలోనూ అంటరాని వారుండరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ తనకు చెందిన 'పూర్తి' గ్రూపు వ్యాపార ప్రణాళికలను ప్రకటించారు. 'పూర్తి' గ్రూపు అక్రమాలకు పాల్పడిందంటూ కొంత కాలం క్రితం ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనివల్లే, మరోసారి బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఎక్కాలని ఆశపడ్డ గడ్కరీ ఆశ తీరలేదు.