: 24 గంటల పాటు జార్ఖండ్ లో భారీ వర్షం
ఫైలిన్ తుపాను తీరాన్ని తాకిన అనంతర పరిణామాల్లో భాగంగా ఒడిశా చుట్టుప్రక్కల రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ఈ ఉదయం నుంచి జార్ఖండ్ లో భారీ వర్షం కురుస్తోందని, మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల పది సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నివారణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తుపాను ఈ రోజు సాయంత్రానికి అల్పపీడనంగా మారనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.