: సాయంత్రం హైదరాబాదుకు బాబు
ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇక్కడి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో ఆయనకి తదుపరి చికిత్స కొనసాగించనున్నారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీలో ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన బాబును బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా బాబు దీక్ష కొనసాగించడంతో, వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించిన సంగతి తెలిసిందే.