: పైలిన్ కారణంగా కోస్తా రైల్వేకు తీవ్ర నష్టం


ఫైలిన్ తుపాను కారణంగా తూర్పు కోస్తా రైల్వేకు భారీ నష్టం వాటిల్లింది. స్టేషన్ల పైకప్పులు, ఓవర్ బ్రిడ్జిలు, విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. కుర్థా నుంచి పలాస వరకు తీవ్రగాలులకు భారీ నష్టం సంభవించింది. ఇచ్ఛాపురం స్టేషన్ వద్ద సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కుర్థారోడ్, మందేశ్వర్, బాలుగాం, సోంపేట, గంజాం, బరంపురం స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లాట్ ఫాం పైకప్పులు గాలికెగిరిపోయి ధ్వంసమయ్యాయి. కుర్థా-పలాస మధ్య విద్యుత్ ఓవర్ హెడ్ లైను తెగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైల్వేలైన్ల మధ్య భారీ వృక్షాలు నేలకొరిగాయి. మందస నుంచి భువనేశ్వర్ వరకు భారీ వృక్షాలు ట్రాక్ లకు అడ్డంగా పడిపోవడంతో సహాయకచర్యల నిమిత్తం ప్రత్యేక రైల్వే బృందాలను తరలించారు. కొన్ని చోట్ల ట్రాక్ లు కూడా ధ్వంసమైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News