: టాస్ ఓడిన భారత్


ఆస్ట్రేలియా జట్టుతో తొలి వన్డేలో భారత్ టాస్ ఓడింది. ఏడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు పుణెలో జరుగుతున్న ఈ డే-నైట్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆసీస్ కెప్టెన్ బెయిలీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ జట్టులో మార్పులేమీ లేవు. టి20 మ్యాచ్ ఆడిన జట్టునే బరిలో దించనున్నారు. ఇక, ఆసీస్ జట్టులో ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ జట్టులోకి రానున్నాడు. కాగా, రాజ్ కోట్ టి20లో విధ్వంసకర బ్యాటింగ్ తో టీమిండియాను విజయతీరాలకు చేర్చిన యువరాజ్ సింగ్ మరోమారు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు.

  • Loading...

More Telugu News