: విడాకుల కోసం భర్తలకు బడితెపూజ
భర్తతో సరిపడట్లేదు.. విడాకులిచ్చి వదిలించుకోవాలి! ఎలా..? అని అమెరికాలోని కొందరు యూదు మహిళలు తలపోశారు. తీవ్రంగా యోచించిన పిదప వారికో ఐడియా వచ్చింది. అదేంటంటే.. భర్తల భరతం పట్టేలా, తమతో విడాకులకు వారిని ఒప్పించేలా చేయడానికి కిరాయి రౌడీలను నియమించుకున్నారు. ఆ మహిళలు తమ భర్తల వివరాలు చెప్పాక కొంతమంది రౌడీలు రంగంలోకి దిగి మొండి మొగుళ్లను పట్టుకుపోవడం.. విడాకులు ఇస్తావా.. చస్తావా? అంటూ కుమ్మేయడం మొదలుపెట్టారు.
దీనికి మంచి ఫలితం వచ్చింది. చావడం కంటే విడాకులు ఇవ్వడమే నయమంటూ వారు దారికి వస్తున్నారట. మెండెల్ యాప్ స్టీన్, మార్టిన్ వోల్ మార్క్ అనే ఇద్దరు రౌడీలది ఇప్పుడిదే దందా. కేసులు ఒప్పుకోవడం.. మరో ఎనిమిది మంది సాయంతో మొండి మొగుళ్ల భరతం పట్టడం. ఈ బాదుడు గ్యాంగ్ ను అమెరికా పోలీసులు న్యూజెర్సీలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ట్రెంటాన్ డిస్ట్రిక్ట్ కోర్టులో వివరాలతో చార్జ్ షీటు దాఖలు చేశారు.