: ఫైలిన్ ధాటికి కార్గో షిప్ గల్లంతు


ఫైలిన్ తుపాను కారణంగా అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ఎంవి బింగో అనే ఒక ఓడ గల్లంతైనట్లు సమాచారం. అక్టోబర్ 11న పశ్చిమ బెంగాల్లోని సాగర్ నుంచి 8 వేల టన్నుల ముడి ఇనుముతో చైనా బయల్దేరిన ఈ షిప్ పనామాకి చెందినదిగా భావిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం చివరిసారి ఓడ సిబ్బంది లైఫ్ బోట్ లో వెళ్లడం కన్పించిందని ఆ తరువాత సిబ్బంది జాడకానీ, షిప్ జాడ కానీ కన్పించలేదని కోల్ కతా పోర్టు ట్రస్టు అధికారులు తెలిపారు. ఓడలో 19 మంది చైనీయులు, ఒక ఇండోనేషియా వ్యక్తి ఉన్నట్టు సమాచారం. తీరప్రాంత గస్తీ దళానికి చెందిన విమానాలు గల్లంతైన ఓడ, లైఫ్ బోట్ల కోసం అన్వేషిస్తున్నాయి.

  • Loading...

More Telugu News