: కోటలో బంగారం ఉందంటూ సాధువుకు కల


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావో జిల్లా దాండియా ఖేడా గ్రామంలో రాజారావ్ రామ్ బక్ష్ సింగ్ కోట ఉంది. ఆ కోటలో 1000 కేజీల బంగారం దాగుందట. ఆ ప్రాంతంలో ఉండే శోభన్ సర్కార్ అనే సాధువుకి ఈ విషయమై కల వచ్చిందట. 1857లో బ్రిటిషర్లతో జరిగిన యుద్ధంలో ప్రాణాలు విడిచిన రాజా రావ్ రామ్ బక్ష్.. శోభన్ సర్కార్ కు కలలో కనిపించి కోటలో పాతిపెట్టిన 1000 కేజీల బంగారం గురించి చెప్పారట. శోభన్ సర్కార్ ను అక్కడ ఎంతో మంది విశ్వసిస్తారు.

దీంతో సాధువు శోభన్ సర్కార్ కేంద్ర సహాయ మంత్రి చరణ్ దాస్ ను కలిసి తనకొచ్చిన కలను వివరించారు. బంగారాన్ని వెలికితీస్తే కష్టకాలంలో దేశానికి ఉపయోగపడుతుందని చెప్పారు. దీంతో మంత్రి చరణ్ దాస్ భారత పురాతత్వ సర్వే విభాగానికి ఈ బాధ్యతలు పురమాయించారు. కోటలో బంగారం సంగతి తేల్చాలని కోరారు. ఈ నేపథ్యంలో పురాతత్వ సర్వే విభాగం ఈ నెల 18న కోటలో తన పనిని ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News