: రామ్ దేవ్ ను ప్రశ్నించిన సీబీఐ


యోగా గురు బాబా రామ్ దేవ్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఓ కేసు విషయమై ప్రశ్నించింది. ఆరేళ్ళ క్రితం రామ్ దేవ్ గురువు స్వామి శంకర్ దేవ్ అదృశ్యం కాగా, ఆ కేసును సీబీఐ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా రామ్ దేవ్ ను గత శుక్రవారం సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. మరోసారి ఆయనను ప్రశ్నించే అవకాశముందని సీబీఐ వర్గాలు తెలిపాయి. కాగా, ఇదే కేసులో సీబీఐ రామ్ దేవ్ శిష్యుడు ఆచార్య బాలకృష్ణను కూడా ప్రశ్నించింది. హరిద్వార్ లో 2007 జులైలో ఓ రోజున మార్నింగ్ వాక్ కు వెళ్ళిన శంకర్ దేవ్ తిరిగి ఆశ్రమానికి రాలేదు. దీనిపై ఉత్తరాఖండ్ లోని కంఖాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే, గతేడాది అక్టోబరులో ఉత్తరాఖండ్ సర్కారు ఈ కేసును చేపట్టాల్సిందిగా సీబీఐని కోరింది. కాగా, ఉత్తరభారతంలో పేరెన్నికగన్న 'దివ్య యోగ్ మందిర్ ట్రస్ట్'కు స్వామి శంకర్ దేవ్ వ్యవస్థాపకుడు. అయితే, ఆయన అదృశ్యం అనంతరం రామ్ దేవ్ ఈ ట్రస్ట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News