: సికింద్రాబాదులో 48 అడుగుల ఆంజనేయుడు


సికింద్రాబాదులో భారీ హనుమంతుడి విగ్రహం ఏర్పాటు కానుంది. పురాణ ప్రాధాన్యం గల నామాలగుండు వీరాంజనేయ స్వామి ఆలయంలో 48 అడుగుల ఎత్తయిన భారీ ఆంజనేయుడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1913లో ఏర్పాటైన నామాలగుండు ఆలయం శతాధికవత్సరం సందర్భంగా ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. పర్వదినాలలో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు. ఇంత ఎత్తయిన ఆంజనేయుడి విగ్రహాలు రాష్ట్రంలో బహు స్వల్పంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News