: 85 బిలియన్ డాలర్ల భారీ కోత విధించిన ఒబామా


అమెరికా ప్రభుత్వ వ్యయాల్లో 85 బిలియన్ డాలర్ల భారీ కోత విధిస్తూ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అమెరికా మిలటరీతో పాటు పలు ప్రభుత్వ పథకాలకు నిధుల సరఫరా నిలిచిపోనుంది. ఈ పరిణామంతో ఆ దేశంలో ఏడు లక్షల ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితికి ప్రభుత్వంలో ఉన్న రిపబ్లికన్లే కారణమని ఒబామా ఆరోపిస్తున్నారు. బడ్జెట్ లో ఇంత మొత్తం తగ్గించే విధంగా ఒబామా నిర్ణయం తీసుకోవడంతో అమెరికా ఆర్థిక ప్రగతి మరింత మందగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News