: కొడుకు దొంగతనాలకు తండ్రి ప్రోత్సాహం


ఏ తండ్రి అయినా కొడుకును ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తాడు. కానీ, వరంగల్ జిల్లా ములుగు ముండలం చెల్పూర్ గ్రామానికి చెందిన చింతకింది భద్రయ్య మాత్రం తన కొడుకుని కేటుగాడిని చేశాడు. అతడి దొంగతనాలను ప్రోత్సహిస్తూ తప్పటడుగులు వేయించాడు. చివరికి కొడుకుతోపాటు భద్రయ్య చేతులకూ బేడీలు పడ్డాయి.

భద్రయ్య కొడుకు(16) 9వ తరగతి నుంచే చిన్నచిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. వరంగల్, కరీనంగర్ జిల్లాలలో పలు ఇళ్లలో దొంగతనాలు చేశాడు. శుక్రవారం మానకొండూర్ మండలం ఖాదర్ గూడెంలో ఒక బైకును దొంగిలించి తీసుకెళుతుండగా.. శంకరపట్నం మండలం తాడికల్ లో తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించిన తర్వాత తండ్రి భద్రయ్యను కూడా అరెస్ట్ చేశారు. చిత్రమేమిటంటే కొడుకు దొంగిలించి తెచ్చిన సొమ్మును భద్రయ్య ఇంట్లో పెట్టెలలో భద్రంగా దాచిపెడుతూ ఉండేవాడట.

  • Loading...

More Telugu News