: ఈ జన్యువులు పగలు మాత్రమే పనిచేస్తాయట


మన శరీరంలోని కొన్ని రకాల జన్యువులు పగటి సమయంలో మాత్రమే పనిచేసేలా వాటి వ్యవస్థ ఉంటుందట. ఎందుకంటే మనం పగలు మాత్రమే ఎండలో తిరుగుతాం కాబట్టి, మన శరీరాన్ని సూర్యుడి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల (ఆల్ట్రా వైలెట్ రేస్) నుండి కాపాడేందుకు ఈ జన్యు వ్యవస్థ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మామూలుగా ఎండలో తిరిగే సమయంలో సూర్యుడి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలనుండి మన చర్మానికి రక్షణ కల్పించే వ్యవస్థ అనేది మన చర్మం మూలకణాల్లోనే అంతర్గతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జన్యువులు పగలు మాత్రమే పనిచేసేలా వాటి వ్యవస్థ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శరీరంలోని చాలా రకాల మూలకణాలకు ఒక ప్రత్యేకమైన అంతర్గత వ్యవస్థ ఉంటుంది. ఇలాగే చర్మానికి సంబంధించిన మూలకణాల్లోని జన్యువులు ఎప్పుడు తగిన పనితీరును కనబరచాలో చెప్పే సూచీ చర్మ మూలకణాల్లో ఉంటుందని కెటలాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్‌ సాల్వడార్‌ అజ్నార్‌ బెనితా చెబుతున్నారు. చర్మంలోని ఈ జన్యువులు తాము ఎప్పుడు పనిచేయాలో తెలిపేలా వాటి మూల కణాల్లోనే అంతర్గత సూచీ ఉంటుందని, దీనివల్లే పగటిపూట అతినీల లోహిత కిరణాలనుండి మన చర్మాన్ని రక్షించే జన్యువులు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని బెనితా చెబుతున్నారు. అయితే వయసు పెరిగే కొద్దీ దీని ప్రభావం తగ్గుతుందని బెనితా చెబుతున్నారు.

  • Loading...

More Telugu News