: శ్రీకాకుళం జిల్లాలో నిలిచిన విద్యుత్
ఫైలిన్ తుపాను ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ 180 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్ స్థంభాలు కూడా కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని మందస, పలాస, కవిటి, బారువ మండలాల్లో జీడిమామిడి తోటలు దెబ్బతిన్నాయి.