: ఫైలిన్ ధాటికి ఆరుగురి మృతి
ఫైలిన్ తుపాను ఒడిశాపై భీకరంగా విరుచుకుపడుతోంది. ఈ సాయంత్రం గోపాల్ పూర్ వద్ద తీరాన్ని తాకిన తుపాను ధాటికి ఒడిశాలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. గంజాం జిల్లాలో చెట్టు కూలి ఇద్దరు మరణించారు. కాగా, గంజాం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకొరిగాయి. అయితే, ముందు జాగ్రత్తగా అక్కడి సర్కారు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. దీంతో, పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది.