: నరేంద్ర మోడీ..దేశంలో అత్యంత ప్రజాకర్షక నేత: రాజ్ నాథ్ సింగ్


దేశంలో అత్యంత ప్రజాకర్షక నేత గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న  పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గుజరాత్ లో మూడు సార్లు బీజేపీని గద్దెనెక్కించిన ఘనత ఒక్క మోడీకే దక్కిందని ప్రశంసించారు. అలాగే మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్, రమణ్ సింగ్ లు కూడా బాగా పనిచేస్తున్నారని రాజ్ నాథ్ హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీపై రాజ్ నాథ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అసమర్థతల వల్లే దేశంలో ధరలు మండిపోతున్నాయని ఆయన విమర్శించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ప్రధాని విఫలమయ్యారని రాజ్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోతే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రకటిస్తామని రాజ్ నాథ్ అన్నారు.

  • Loading...

More Telugu News